మోదీజీ.. నా ప్రేమ, మద్దతు మీకు ఉంటాయి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ అస్వస్థతకు గురై మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుపుతూ హెల్త్ బులిటిన్ విడుదల చేశారు వైద్యులు. ఈ క్రమంలో హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్‌లో స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
‘తల్లీకొడుకుల మధ్య ప్రేమ వెలకట్టలేనిది. మోదీ జీ, ఈ కఠిన సమయంలో నా ప్రేమ, మద్ధతు మీకు ఉంటాయి. మీ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా.’అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం స్పందించారు. హీరాబెన్ త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలి ప్రార్థించారు.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
ఇదీ చదవండి: నిలకడగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం