Punjab Police scale up manhunt for Amritpal Singh - Sakshi
Sakshi News home page

అమృత్‌పాల్‌ కోసం డేరాల్లో గాలింపు

Apr 1 2023 4:35 AM | Updated on Apr 1 2023 9:51 AM

Punjab Police scale up manhunt for Amritpal - Sakshi

హోషియార్‌పూర్‌:  వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ‘వారిస్‌ దే పంజాబ్‌’ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడి కోసం పంజాబ్‌ పోలీసులు వేట మరింత ముమ్మరం చేశారు. హోషియార్‌పూర్‌ జిల్లాలో ప్రస్తుతం గాలింపు ఉధృతంగా కొనసాగుతోంది. సిక్కు మత సంస్థలైన ‘డేరా’ల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హోషియార్‌పూర్‌ జిల్లాలోని మర్నియాన్‌తోపాటు సమీప గ్రామాల్లో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నివాసిత ప్రాంతాలే కాకుండా పశువుల పాకలు, పొలాల్లో బోరుబావుల వద్ద ఉండే గదులను సైతం వదిలిపెట్టడం లేదు. డేరాల్లో అమృత్‌పాల్‌ తలదాచుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ దిశగా గాలింపు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఇంటింటికీ తిరిగి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement