స్వీయ నిర్బంధంలోకి పంజాబ్‌ ముఖ్యమంత్రి

Punjab CM Self Isolates After Meeting Covid MLAs In Assembly - Sakshi

చండీఘడ్‌ : పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఇవాళ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. నిన్న(శుక్రవారం) నిర్వహించిన అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ముఖ్యమంత్రి నేటి నుంచి 7 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు మీడియా అధికారి రవీన్‌ తుక్రాల్‌ ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కలిపి 29 మంది కరోనా బారిన పడ్డారని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. అయితే కరోనా సోకిన ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన వారు శాసనసభ సమావేశానికి హాజరు కావొద్దని ముఖ్యమంత్రి కోరారు. (23 మంది ఎమ్మెల్యేలకు కరోనా: పంజాబ్‌ సీఎం)

శాసనసభ సజావుగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అమరీందర్‌ సింగ్ ఆదేశించారు. పంజాబ్‌ భవన్‌, ఎమ్మెల్యేల హాస్టల్స్‌ వద్ద తర్వతగతిన కరోనా పరీక్షలు నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశమైన 48 గంటల్లో  నెగిటీవ్‌ వచ్చిన వారిని మాత్రమే హాజరుకావడానికి అనుమతించారు. కరోనా నెగటివ్‌ రిపోర్టు చూపించిన తర్వాతే అసెంబ్లీలో ప్రవేశించేందుకు వీలు ఉంటుందని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పంజాబ్‌లో 47,800 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 1,256 మంది ప్రాణాలు కోల్పోయారు. (జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top