CM Bhagwat Mann: కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం మాన్

ఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు పంజాబ్ సీఎం మాన్. ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండి: పంజాబ్ ఎన్‌కౌంటర్: సిద్ధూ హంతకులకు మట్టుబెట్టారిలా..