పీఎస్‌ఎల్‌వీ సీ53 అనుసంధాన పనులు ప్రారంభం | PSLV C53 connection works was started | Sakshi
Sakshi News home page

పీఎస్‌ఎల్‌వీ సీ53 అనుసంధాన పనులు ప్రారంభం

Jan 3 2022 5:04 AM | Updated on Jan 3 2022 5:04 AM

PSLV C53 connection works was started - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్‌ అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుదశల పరీక్షలు జరుగు తున్నాయి.

ఈ నెల 20న ఈ ప్రయోగాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. అయితే ఉపగ్రహం రావడంలో జాప్యం జరిగితే ప్రయోగం ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశముందని సమాచారం. పీఎస్‌ఎల్‌వీ సీ53 ద్వారా ఈఓఎస్‌–6(ఓషన్‌శాట్‌–3) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement