విలన్‌ రేంజ్‌లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని... | Property Dealer Kicks Doctor Teacher Couple In Indore Road Rage | Sakshi
Sakshi News home page

Viral Video: విలన్‌ రేంజ్‌లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...

Dec 12 2022 3:43 PM | Updated on Dec 12 2022 3:56 PM

Property Dealer Kicks Doctor Teacher Couple In Indore Road Rage - Sakshi

పెద్ద ప్రమాదం కాకపోయినా... నానాబీభత్సం సృష్టించాడు ఒక వ్యక్తి. వృద్ధ దంపతులన్న కనికరం లేకుండా ఘోరంగా దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పోలీసులు పెద్ద ప్రమాదం కాదని తేల్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రోడ్డుపై అనుకోకుండా చిన్నప్రమాదం జరిగింది. వాస్తవానికి అది పెద్ద ప్రమాదం కాదు. ఒక వృద్ధ దంపుతులు ప్రయాణిస్తున్న కారు, వ్యాపారీ కారు ఒక దానికొకటి జస్ట్‌ రెప్పపాటులో రాసుకున్నాయి. అంతే సదరు వ్యాపారి రోడ్డుపై కారు ఆపేసి ఆ వృద్ధ దంపతులపై గొడవకు దిగాడు. ఆ దంపతుల్లో భర్త​ పిడీయాట్రిక్‌ వైద్యుడు కాగా, అతడి భార్య ఉపాధ్యాయురాలు.

సదరు వ్యక్తి వ్యాపారి దంపతులపై దాడి చేయడం, మహిళను తన్నిడం వంటివి చేశాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు ధర్మేంద్ర కుష్వాపై కేసు నమోదు చేశారు. సదరు వృద్ధ దంపతులు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వాపోయారు. తమకు సాయం చేయడానికి ఎవరు రాలేదని ఆ దంపతులు వాపోయినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి అది ఏవిధంగానూ పెద్ద ప్రమాదం కాదని, అతడు కావాలనే వారిపై దాడికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

(చదవండి: శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement