15 సంవత్సరాల తర్వాత రైలెక్కిన భారత రాష్ట్రపతి

President Ramnath kovind Ttavels in Speical Train For His Native Place  - Sakshi

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ శుక్రవారం రైలు ప్రయాణం చేశారు. తన సతీమణి సవితాదేవితో కలిసి తమ స్వస్థలం కాన్పూర్‌కు రైలులో బయలు దేరారు. దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక రైలు ఎక్కిన రాష్టపతి దంపతులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, రైల్వేబోర్డు చైర్మన్‌, సీఈఓ సునీల్‌ శర్మ వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వెళ్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 15 సంవత్సారాల తర్వాత భారత రాష్టపతి రైలు లో ప్రయాణం చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2006లో అప్పటి భారత రాష్టపతి అబ్దుల్‌ కలాం ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో ప్రయాణించారు.

కాన్పూర్ దేహాట్ మార్గంలోని జిన్జాక్, రురా వద్ద ఈ ప్రత్యేక రైలు కొద్దిసేపు ఆగనుంది. రాష్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన పాత పరిచయస్థులను,తన పాఠశాల స్నేహితులను కలిసి మాట్లాడనున్నారు. ఆ తరువాత తన స్వగ్రామానికి  చేరుకుంటారు. స్వగ్రామాన్ని సంద‌ర్శించిన అనంతరం జూన్ 28వ తేదీన కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషనులో రైలు ఎక్కి లక్నోకు చేరుకుంటారు. లక్నో పర్యటన అనంతరం జూన్ 29వ తేదీన రామ్‌నాథ్ ప్రత్యేక విమానంలో లక్నో నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు.

చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top