ప్రపంచ దేశాలన్ని భారత్‌ను ప్రశంసిస్తున్నాయి: సీతారామన్

PM Working To Uplift Indias Image, Opposition Tarnishing It: Minister - Sakshi

న్యూఢిల్లీ:  వంద కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వడంతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. నేడు(నవంబర్ 7) దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన బిజెపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం సాధించిన విజయాలు గురించి ఆమె మాట్లడారు. వ్యాక్సినేషన్, మొత్తం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర బడ్జెట్‌లో ₹36,000 కోట్లు కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. 

భారత దేశ ప్రతిష్టను పెంపొందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు దానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆమె తెలిపారు. రక్షణ, సైన్యంలో మహిళలకు ప్రవేశం, సైనిక్ పాఠశాలల స్థాపన తీర్మానంలో భాగంగా వచ్చాయని మంత్రి తెలిపారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధే తమ నినాదం అని ఆమె అన్నారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ పంపిణీ గురించి ప్రస్తావించారు. "మన దేశ జాగ్రత్తగా కాపాడుకుంటూ మేము 8 నెలల పాటు 80 కోట్ల మందికి ఆహారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు.. "ఒకే దేశం, ఒక రేషన్ కార్డు" జారీ చేసినట్లు కూడా ఆమె తెలిపారు.

(చదవండి: దేశంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు)

జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు "అన్ని సమస్యలు" నుంచి తప్పించుకొని అభివృద్ది వైపు అడుగులు వేస్తుంది అంటూ ఆర్టికల్ 370 విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తున్నామని, డిజిటల్ ఇండియా ద్వారా "పారదర్శకత"ను తీసుకొచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. "భారతదేశంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ ఇండియా మిషన్ వాటిని వేగవంతం చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా మిషన్ సహాయంతో కూడిన ఆత్మనిర్భర్ భారత్ దేశాన్ని బలోపేతం చేస్తుంది'' అని ఆమె తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top