Pulwama Attack Anniversary: పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు..

Pm Narendra Modi Pays Tributes To Pulwama Martyrs - Sakshi

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని,  దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

2019 ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ బాలాకోట్‌లోకి ప్రవేశించి భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉగ్ర శిబిరాలను పేల్చి వేసింది. ఈ ఘటనలో దాదాపు 250 మంది తీవ్రవాదాలు హతమైనట్లు అమిత్ షా ఓ ఎన్నికల ర్యాలీలో తెలిపారు.
చదవండి: ‘అదానీ’పై అదే దుమారం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top