ప్రజలకు, నాకు దూరం పెంచొద్దు: పీఎం మోదీ | Sakshi
Sakshi News home page

అలా నన్ను పిలవద్దు: పీఎం మోదీ

Published Thu, Dec 7 2023 3:46 PM

PM Modi Tells BJP MPs Dont Say Adarniya ModiJi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘మోదీజీ’, ‘ఆదరణీయ’ వంటి గౌరవ సూచకమైన పదాలను ఉపయోగించి తనను సంబోధించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ ఎంపీలకు కోరారు. గురువారం నిర్వహిచంన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇంత పెద్ద బీజేపీ పార్టీలో తాను కూడా ఓ చిన్న కార్యకర్తనని అన్నారు.  అయితే తనను పిలిచే క్రమంలో పేరు ముందు, వెనక గౌరవ సూచక పదాలు ఉపయోగించవద్దని అన్నారు.

దేశ ప్రజల దృష్టిలో తాను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరినని పేర్కొన్నారు. తనను సంబోధించే క్రమంలో ‘శ్రీ, ఆదరణీయ’ వంటి అనే గౌరవ సూచకమైన పదాలు దేశ ప్రజలకు తనకు మధ్య దూరం పెంచినట్లు అవుతుందని చెప్పారు. ప్రజలు తనను కూడా మీఅందరిలో ఒకడిగానే చూస్తారని పేర్కొన్నారు. ఇక ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించడంలో.. బృందంగా అందరి సమృష్టి కృషి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

 
Advertisement
 
Advertisement