వైరల్‌: గుడిసెకు కాళ్లు వచ్చాయా?

People Shift House On Foot In Nagaland Village Is Viral On Social Media - Sakshi

న్యూఢిల్లీ: ఏదైనా ఓ భారీ వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లాలంటే కొంతమంది సమిష్టిగా పని చేయాల్సిందే. ఎంత పెద్ద పనైనా బృందంగా ఏర్పడి చేస్తే ఎటువంటి అలసట లేకుండానే పూర్తవుతుంది. ఇటువంటి ఓ పనిని నాగాలాండ్‌లోని ఓ గ్రామ ప్రజలు చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొంతమంది స్థానికులు నాగాలాండ్‌లోని ఒక గ్రామంలో ఏకంగా ఓ గుడిసె ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కాలినడకన చేతులపై మోస్తూ మార్చారు. ఆ గుడిసెను నాలుగు వైపుల పట్టుకొని అది ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి మార్చారు.

ఈ వీడియోను  ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఐక్యతమే మహా బలం అని నాగాలు మనకు చూపించే వీడియో ఇది. నాగాలాండ్‌లోని ఓ గ్రామంలో హౌస్ షిఫ్టింగ్ చాలా పురోగతిలో ఉంది’ అని కామెంట్‌ జత చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో  సుమారు 9 వేల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చేసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు ‌ చేస్తున్నారు. ‘చక్రాలు లేకుండానే షిఫ్టింగ్‌.. అద్భుతం’, ‘వావ్‌.. ఇది టీం వర్క్‌ అంటే’, ‘గుడిసెకు కాళ్లు వచ్చాయా?’ అని నెటిజన్లు కామెంట్లు‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top