5 నిమిషాల మాక్‌ డ్రిల్‌: 22 మంది ప్రాణాలు గాల్లో!

Oxygen Mock Drill 22 Turned Blue: Probe Into UP Hospital Owner Audio - Sakshi

 ఒ‍క పక్క ప్రాణాలు పోతోంటే.. ఆక్సిజన్‌ నిలిపివేత

ఆసుపత్రి యజమాని ఆడియో సంచలనం

విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్‌ 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.  ఒకవైపు కరోనాతో తీవ్ర అనారోగ్యం , ఆక్సిజన్‌ కొరతతో పేషెంట్లు విల విల్లాడిపోతోంటే..ఆగ్రాలోని పరాస్ ఆసుపత్రిలో కావాలనే "మాక్ డ్రిల్" నిర్వహించిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏప్రిల్ 27న క్రిటికల్‌ కేర్‌లో ఉన్న పేషెంట్లకు అయిదు నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరాను నిలిపివేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.  దీనికి సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం సంచలన ఆడియో క్లిప్‌  సోషల్‌ మీడియాలో రౌండ్లు కొడుతోంది. దీనిపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

పారాస్ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ "మాక్ డ్రిల్" లో భాగంగా ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరాను తగ్గించినట్లు చెబుతున్న ఒక ఆడియో  చక్కర్లు కొడుతోంది. ఇదే ఆసుపత్రిలో కోవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు అనుమతి కూడా ఉంది. అయితే తీవ్రమైన ఆక్సిజన్‌  కొరత కారణంగా డిశ్చార్జ్‌ కావాలని ఎన్నిసార్లు చెప్పినా బాధితుల బంధువులు  నిరాకరించడంతో  ఒక ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. దీంతో ఏప్రిల్‌ 27, ఉదయం 7 గంటలకు, తాము ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరాను తొలగించామని, దీంతో  ఊపిరాడక 22 మంది రోగుల శరీరాలు నీలం రంగులోకి మారిపోయాయనీ, వారు బతికి ఉండే అవకాశం లేదని ఈ ఆడియోలో జైన్‌ పేర్కొన్నారు. అందుకే ఆక్సిజన్‌ లేకపోతే మనుగడ కష్టమని గ్రహించి మిగిలిన 74 మంది రోగుల కుటుంబ సభ్యులను వారి వారి సొంత ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోమని తెలిపామన్నారు.

ఈ ఆడియో సంచలనంగా మారడంతో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఈ ఆసుపత్రిలో, ఏప్రిల్ 26, 27 తేదీలలో ఏడు కోవిడ్ మరణాలు సంభవించాయనీ, ఈ వీడియోపై దర్యాప్తు చేయనున్నామని ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ వీడియోపై జైన్‌ మాట్లాడుతూ ఆడియోలోని తన మాటలను వక్రీకరించారని చెబుతున్నారు. అసుపత్రిలో రోగుల ఆక్సిజన్ డిపెండెన్సీని, ఈ కొరతను అధిగమించేందుకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించాం తప్ప,  22 మంది చనిపోయారని తాను చెప్పలేదని వాదించారు. 

దీనిపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. బీజేపీ పాలనలో, ఆక్సిజన్‌, మానవత్వం రెండింటికీ తీవ్రమైన కొరత ఏర్పడిందంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  అలాగే ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆక్సిజన్‌ కొరత సమయంలో ప్రధాని, యూపీ సీఎం యోగి, రాష్ట్రమంత్రి వ్యాఖ్యలను ఉటంకించిన ప్రియాంక గాంధీ, దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-06-2021
Jun 09, 2021, 07:40 IST
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ డిసెంబర్‌ నాటికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంపై కేంద్రం తన విధానాన్ని, రోడ్‌ మ్యాప్‌ను పార్లమెంట్‌లో...
09-06-2021
Jun 09, 2021, 06:56 IST
సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి వినియోగిస్తున్న ఐరిస్‌ సాంకేతికతతో కరోనా వ్యాపించే అవకాశం ఉందంటూ...
09-06-2021
Jun 09, 2021, 04:36 IST
బీజింగ్‌/ సిడ్నీ: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకయిందన్న అనుమానాలు బలపడేలా రోజుకో కథనం...
08-06-2021
Jun 08, 2021, 18:50 IST
న్యూఢిల్లీ: ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన కోవిడ్‌ మహమ్మారి గత కొద్ది రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టిన...
08-06-2021
Jun 08, 2021, 16:26 IST
సాక్షి, పుణె: భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా  వైరస్‌ మ్యుటేషన్‌ చెందడంతో కేసుల సంఖ్య...
08-06-2021
Jun 08, 2021, 13:48 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. ...
08-06-2021
Jun 08, 2021, 13:04 IST
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది తమ ఆదాయ వనరులను కోల్పోయారు. ముప్పై నాలుగేళ్ల అంబికకు కూడా 14 ఏళ్లుగా తన...
08-06-2021
Jun 08, 2021, 11:04 IST
వెబ్‌డెస్క్‌: కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదని కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్‌ మెంబర్‌ వీకే పాల్‌...
08-06-2021
Jun 08, 2021, 10:30 IST
భారీ ఊరట.. లక్షకు దిగువన కొత్త కేసులు
08-06-2021
Jun 08, 2021, 08:51 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ విషయంలో హేతుబద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన...
08-06-2021
Jun 08, 2021, 08:34 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారి కోసం ఏప్రిల్‌ 1వ తేదీ...
08-06-2021
Jun 08, 2021, 08:26 IST
ఐజ్వాల్‌: కరోనా మహమ్మారితో స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో విద్యార్థులంతా ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితమయ్యారు. క్లాసులతో పాటు పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో రాయాల్సి...
08-06-2021
Jun 08, 2021, 08:04 IST
సాక్షి, రాజన్నసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన అనంతుల రవీందర్‌ సుమారు 30ఏళ్లుగా స్థానిక పాత బస్టాండ్‌లో మెస్‌ నడుపుతూ కుటుంబాన్ని...
08-06-2021
Jun 08, 2021, 05:44 IST
డాక్టర్‌ ఇఫ్రాహ్‌ ఫాతిమా, ఉస్మానియా హాస్పిటల్‌లో ఎంబీబీఎస్‌ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్‌ మౌనిక వడియాల. తను కూడా ఎంబీబీఎస్‌...
08-06-2021
Jun 08, 2021, 05:42 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు....
08-06-2021
Jun 08, 2021, 05:18 IST
న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా...
08-06-2021
Jun 08, 2021, 04:43 IST
వెంకటాచలం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభమైంది. వెంకటాచలం మండలం గొలగమూడిలో భగవాన్‌...
08-06-2021
Jun 08, 2021, 04:26 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారి థర్డ్‌వేవ్‌తో మరోసారి విరుచుకుపడినా ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా కట్టడి చేసి బాధితులకు చికిత్స అందించడం,...
08-06-2021
Jun 08, 2021, 03:16 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో కర్ఫ్యూను ఈ నెల 20వతేదీ వరకు పొడిగిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
08-06-2021
Jun 08, 2021, 03:08 IST
కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం సన్నద్ధం
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top