షాకింగ్‌: 150మంది సాధువులకు కరోనా

Over 150 Monks Test Covid Positive In Himachal Pradesh - Sakshi

ధర్మశాలలో వెలుగు చూసిన ఘటన

ఆశ్రమాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు

ధర్మశాల: హిమాచల్‌ ప్రదేశ్‌ కంగ్రా జిల్లా జోన్‌గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి 18వ తేదీన టిబెటన్ కొత్త సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో బౌద్ధ ఆశ్రమంలో 20 మందికి కరోనా సోకడంతో అప్రమత్తమైన వైద్యాధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు చేశారు. వారిలో 154 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23వ తేదీన 15 మంది బౌద్ధ భిక్షువులు వచ్చారు. 

కరోనా వచ్చిన సాధువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ప్రయాణాలు చేసి వచ్చిన వారిని ఆశ్రమంలోనే క్వారంటైన్ చేశామని కంగ్రా జిల్లా కలెక్టరు రాకేష్ ప్రజాపతి చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్ అని తేలింది. కానీ ఇందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనని తాండ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించామని కలెక్టర్‌ వివరించారు. ధర్మశాలలోని కరోనా ప్రబలిన బౌధ్ధ ఆశ్రమానికి సీలు వేశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని అధికారులు చెప్పారు.

చదవండి: 
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top