అలలపై ఆంబులెన్స్‌.. ఐడియా అదిరింది

Odisha: Bsf Dig Inaugurates Boat Ambulance For Malkangiri - Sakshi

మల్కన్‌గిరి( భువనేశ్వర్‌): జిల్లాలోని చిత్రకొండ సమితి, స్వాభిమాన్‌ ఏరియా, జాన్‌బాయి గ్రామం వద్ద ఉన్న చిత్రకొండ జలాశయం దగ్గర బోటు అంబులెన్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్‌ఎఫ్‌ డీఐజీ సంజయ్‌కుమార్‌ సింగ్‌ హాజరై, బోటు అంబులెన్స్‌ ఆరంభించి, ప్రజలకు అంకితమిచ్చారు. ఉదయం బీఎస్‌ఎఫ్‌ క్యాంపు ఆవరణలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఆ కార్యక్రమం అనంతరం ఇక్కడి ప్రజలకు తమ వంతు సహాయంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్‌ను వినియోగంలోకి తీసుకురావడం విశేషం.

ఇప్పటివరకు జలాశయం మధ్య భూభాగంలోని పనాస్‌పుట్, జాంత్రి, ఆండ్రహల్, జోడాంబు పంచాయతీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీర్చుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో జలాశయం మధ్య గుండా పడవలో ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ఒక్కోసారి జరిగిన పడవ బోల్తా దుర్ఘటనల్లో పలువురు మృత్యువాత పడడం విచారకరం. ఇదంతా గమనించిన బీఎస్‌ఎఫ్‌ జవానులు వారి కష్టాలు తీర్చాలని యోచించారు. గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ బోటు అంబులెన్స్‌ను ప్రస్తుతం ప్రజా వినియోగంలోకి తీసుకురావడం గమనార్హం.

చదవండి: రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top