ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల నమోదు తప్పనిసరి

Published Sat, Feb 17 2024 6:29 AM

NRIs and Indian citizens should be made compulsorily registered in India - Sakshi

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), భారత సంతతికి చెందిన విదేశీయులు(ఓసీఐ)–భారతీయ పౌరుల మధ్య మోసపూరిత వివాహాల పెరుగుతండటం ఆందోళనకరమని న్యాయ కమిషన్‌ పేర్కొంది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి సమగ్రమైన చట్టం తేవాలని కేంద్రానికి సూచించింది. భారతీయులు–ఎన్‌ఆర్‌ఐలు, భారతీయులు–ఓసీఐల మధ్య పెళ్లిళ్లను విధిగా రిజిస్టర్‌ చేసే విధానం ఉండాలని స్పష్టం చేసింది.

జస్టిస్‌ రితూరాజ్‌ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్‌ ‘లా ఆన్‌ మ్యాట్రిమోనియల్‌ ఇష్యూస్‌ రిలేటింగ్‌ టు ఎన్‌ఆర్‌ఐ, ఓసీఐ’ అంశంపై అధ్యయనం చేసింది. ఇటీవల కేంద్ర న్యాయ శాఖకు ఇటీవలే నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్రం తేదలచిన చట్టం పెళ్లిళ్లకు వివాదాలన్నింటినీ పరిష్కరించేలా సమగ్రంగా ఉండాలని అభిప్రాయపడింది. మోసపూరిత ఎన్‌ఆర్‌ఐ వివాహాలతో భారత యువతులు అధికంగా నష్టపోతున్నారని గుర్తుచేసింది.

విడాకులు, భాగస్వామికి భరణం, కస్టడీ, చిన్నారుల జీవన వ్యయాన్ని భరించడం వంటి అంశాలను చట్టంలో చేర్చాలని సిఫార్సు చేసింది. వైవాహిక స్థితిని కచి్చతంగా వెల్లడించేలా పాస్‌పోర్టు చట్టం–1967లో సవరణలు చేయాలని పేర్కొంది. పాస్‌పోర్టులో మ్యారేజీ రిజి్రస్టేషన్‌ నెంబర్‌ కూడా ఉండాలని తెలిపింది. ఇద్దరు జీవిత భాగస్వాముల పాస్‌పోర్టులను అనుసంధానించాలని, దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది.
 

 
Advertisement
 
Advertisement