భార్య పాస్‌పోర్ట్‌ దరఖాస్తుపై భర్త సంతకం అక్కర్లేదు | No need husband permission or signature to apply for wife passport | Sakshi
Sakshi News home page

భార్య పాస్‌పోర్ట్‌ దరఖాస్తుపై భర్త సంతకం అక్కర్లేదు

Jun 22 2025 5:24 AM | Updated on Jun 22 2025 5:24 AM

No need husband permission or signature to apply for wife passport

మద్రాస్‌ హైకోర్టు స్పష్టీకరణ

చెన్నై: పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు భర్త అనుమతి, వారి సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త సంతకం లేకుండా కొత్త పాస్‌పోర్ట్‌ జారీ చేసేలా అధికారులను ఆదేశించాలంటూ రేవతి అనే మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ వెంకటేశ్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2023లో వివాహం కాగా, తన భర్త విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేశారని, అది పెండింగ్‌లో ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ విషయం తెలిపిన తర్వాత కూడా రీజినల్‌ పాస్‌పోర్టు ఆఫీస్‌(ఆర్‌పీవో) భర్త అనుమతి, సంతకం తప్పనిసరని చెబుతున్నాన్నారు.

 వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు భర్త అనుమతి, సంతకం కావాలన్న వాదన పురుషాధిక్య ధోరణిని చాటుతోంది. భార్యను భర్త సొంత ఆస్తిగా సమాజం భావిస్తుండటం సరికాదు. వివాహంతో మహిళ తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు. మహిళా సాధికారిత దిశగా అడుగు వేస్తున్న సమాజానికి ఈ ధోరణి మంచిది కాదు’అని పేర్కొన్నారు. పిటిíÙనర్‌ అర్హతలను పరిశీలించి, ఆమెకు నాలుగు వారాల్లోగా పాస్‌పోర్టును మంజూరు చేయాలని పీఆర్‌వోను న్యాయమూర్తి ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement