దావత్‌లు ఇవ్వరు.. డీజే, బారాత్‌లు బంద్‌.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు అక్కడ!!

No More Lavish Weddings Two Communities Decided From Rajasthan Pali - Sakshi

జోధ్‌పూర్‌: భారీగా విందు భోజనాలు, తాహతుకు మించి ఆడంబరాలు, అలంకరణలకు స్వస్తి చెప్పాలని రాజస్తాన్‌లోని పాలికి చెందిన రెండు వర్గాల వారు నిర్ణయించుకున్నారు. డీజేలు ఉపయోగించవద్దని, టపాసులను కాల్చరాదని, పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగుతూ రాకూడదని కట్టుబాటు విధించారు. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

కుమావట్, జాట్‌ కులాలకు చెందిన 19 గ్రామాలకు చెందిన నేతలు ఈనెల 16వ తేదీన ఈ మేరకు అంగీకారానికి వచ్చారు. అంతేకాదు.. వధూవరులకు బంధువులు కానుకగా ఇచ్చే నగలు, దుస్తులు, నగలు తదితరాలపైనా పరిమితి పెట్టారు. ఇక పవిత్ర కార్యంగా భావించే పెళ్లిలో వరుడు గడ్డం పెంచుకుని ఉండరాదని రూల్‌ విధించారు.

వివాహ వేడుకల్లో అలంకరణలు, సంగీత కార్యక్రమాలు, ఇతర సంప్రదాయాల పేరిట అనవసరంగా ఖర్చు చేసి, అప్పుల పాలు కారాదన్నదే తమ ఉద్దేశమన్నారు. వీటిని అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. అతిక్రమించే వారిపై జరిమానా ఇతర శిక్షలు విధిస్తాంమని హెచ్చరించారు.

అదేవిధంగా, పాలిలోని రోహెత్ సబ్‌డివిజన్‌లోని ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ కూడా వివాహ కార్యక్రమాలను హుందాగా చేయడానికి నిబంధనలను రూపొందిందించాయి. బారాత్‌లు బంద్‌ చేశాయ్‌.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top