24 గంటల్లో ఒక్కరు కూడా మరణించలేదు.. | No Covid Deaths In Last 24 Hours In 15 States And Union Territories | Sakshi
Sakshi News home page

రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న మహమ్మారి ప్రభావం

Feb 9 2021 5:58 PM | Updated on Feb 9 2021 6:02 PM

No Covid Deaths In Last 24 Hours In 15 States And Union Territories - Sakshi

న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత వారం రోజుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌, త్రిపుర, దాదర్‌ మరియు నాగర్‌ హవేలీ, నాగాలాండ్‌, మిజోరం, లక్ష్య ద్వీప్‌లలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోందని, గడిచిన ఐదు వారాల్లో రోజు వారీ మరణాలు 55 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం శుభసూచకమని, గడిచిన 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం ఆనందదాయకమని నీతి ఆయోగ్ అధికారి వీకే పాల్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement