Union Budget 2023: బడ్జెట్‌లో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ..ఓహ్‌ !సారీ అంటూ...

Nirmala Sitharaman Made Interesting Mistake Replacing Old Political - Sakshi

లోక్‌సభలో 2023-24 బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికరమైన పొరపాటు చేశారు. ఆమె అనుకోకుండా టంగ్‌ స్లిప్‌ అయ్యి అన్న మాటతో అక్కడ ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరబూశాయి. వెహికల్‌ రీప్లేస్‌మెంట్‌ గురించి మాట్లాడుతూ ఆమే ఓల్డ్‌ పొల్యూషన్‌ వెహికల్స్‌ బదులుగా ఓల్డ్‌ పాలిటిక్స్‌ అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయిందంటే పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు అర్థం వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి.

అయితే ప్రతి పక్షాల సభ్యుల ముఖాలు ఎలాంలి భావాన్ని వ్యక్తం చేయాలేదు. ఐదే ఈ తప్పిదాన్ని నిర్మలమ్మ వెంటనే గమనించి చిరునవ్వుతో..ఓహ్‌ సారీ అంటూ సరైన వివరణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు. అంతేగాదు పాత కాలుష్య వాహనాలను మార్చడం మన ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని నిర్మలమ్మ చెప్పారు. అలాగే బడ్జెట్‌ 2021-22లో పేర్కొన్న వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

(చదవండి: పీఎం విశ్వ కర్మ  కౌశల్‌ సమ్మాన్‌: బడ్జెట్‌ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top