కొత్త కాపురంలో విషాదం.. భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

బెంగళూరు: కొత్త దంపతులు సినిమా చూసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా వెనుక నుంచి వేగంగా లారీ ఢీకొనడంతో భార్య ఘటన స్థలంలోనే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నగరంలోని బాణసవాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్దరాత్రి చోటుచేసుంది. బాణసవాడికి చెందిన శ్వేత (23) ఆనంద్ (28) దంపతులకు ఇటీవల వివాహం జరిగింది.
కొత్త దంపతులు శనివారం రాత్రి సినిమా చూసి ఆనందంగా ఇంటికి బయలుదేరారు. కల్యాణనగర జంక్షన్ వద్ద లారీ స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే శ్వేత మృతి చెందగా ఆనంద్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..)