నెలాఖరుకు పార్లమెంట్‌ నూతన భవనం సిద్ధం

New Parliament building to be ready by January-end says Govt - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్‌ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టాలో భాగమే పార్లమెంట్‌ కొత్త భవనం.

రాష్ట్రపతి భవన్‌– ఇండియా గేట్‌ మధ్యలోని మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్‌ నవీకరణ, కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్, ప్రధాని కొత్త కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ చేపట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top