మైసూరు జంబూ సవారీ చూడాలంటే.. జేబుకు చిల్లే.. | Mysuru Dasara Visitors to pay more for Accommodation | Sakshi
Sakshi News home page

మైసూరు జంబూ సవారీ చూడాలంటే.. జేబుకు చిల్లే..

Oct 13 2026 8:52 AM | Updated on Oct 13 2026 8:53 AM

Mysuru Dasara Visitors to pay more for Accommodation

మైసూరు: కర్ణాటకలోని ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులకు హోటల్ యాజమాన్యాలు షాక్ ఇస్తున్నాయి. పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని చివరి నాలుగు రోజుల్లో (అక్టోబర్ 18 నుంచి 21 వరకు) గదుల అద్దెలను ఏకంగా 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు హోటల్ యజమానుల సంఘం ప్రకటించింది.

ముఖ్యంగా విజయదశమి నాటి జంబూ సవారీ ఊరేగింపు స్పష్టంగా తిలకించగలిగే సయాజీ రావు రోడ్డులోని కొన్ని హోటళ్లు గదుల చార్జీలను ఏకంగా రెట్టింపు చేసేశాయి. నగరంలోని సుమారు 420 హోటళ్లు, హోమ్‌స్టేలలో ఉన్న 18,500 గదుల్లో ఇప్పటికే 70 శాతానికి పైగా ముందస్తుగానే బుక్ అయిపోగా, అక్టోబర్ 18 నాటికి నగరంలో ఒక్క గది కూడా ఖాళీగా దొరికే అవకాశం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు సి నారాయణ గౌడ తెలిపారు.

కేఎస్సార్టీసీ బస్సులు పండుగ చార్జీలు పెంచినందుకే తామూ రేట్లు పెంచాల్సి వచ్చిందని హోటల్ యజమానులు సమర్థించుకుంటున్నారు. మరోవైపు చాముండి కొండపై ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచే నగరంలో పర్యాటకుల తాకిడి పెరిగి ట్రాఫిక్ స్తంభించిపోవడంతో కొద్ది కిలోమీటర్ల ప్రయాణానికే గంటల కొద్దీ సమయం పడుతోంది. వెరసి అటు ట్రాఫిక్ కష్టాలు, ఇటు గదుల ధరల బాదుడుతో సందర్శకుల జేబులు గుల్లవుతున్నాయి.

ఇదీ చదవండి: 23 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement