ఆ కార్పొరేటర్ల బకాయిలు  రూ. 40 లక్షలు | Mumbai BMC Corporators arrears were Rs 40 lakhs | Sakshi
Sakshi News home page

ఆ కార్పొరేటర్ల బకాయిలు  రూ. 40 లక్షలు

Aug 26 2021 9:11 PM | Updated on Aug 26 2021 9:41 PM

Mumbai BMC Corporators arrears were Rs 40 lakhs - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, ముంబై: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు తదితర కేసుల్లో అనర్హత వేటు పడిన పలువురు కార్పొరేటర్లు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కి భారీగా బకాయిపడ్డారు. మొత్తం 12 మంది మాజీ కార్పొరేటర్లు రూ. 40 లక్షల మేర బకాయి పడ్డారని బీఎంసీ అకౌంట్స్‌ విభాగం తెలిపింది. వారిని వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బీఎంసీకి బకాయి పడిన 12 మందిలో శివసేన పారీ్టకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందినవారు ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఎన్సీపీకి చెందిన వారు ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు.

సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోటీచేసే అభ్యర్థులు టికెట్‌ దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి తాము గెలిచే అవకాశమున్న రిజర్వుడ్‌ వార్డుల నుంచి పోటీ చేసేందుకు తప్పుడు లేదా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమరి్పస్తారు. అలాంటి వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులుంటే పరిశీలిస్తారు. ఆ తరువాత ఆరోపణలు నిజమని తేలితే గెలిచిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేస్తారు. వారి స్థానంలో ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

కానీ, ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి నాలుగైదు నెలలు గడుస్తుంది. ఈ కాలవ్యవధిలో కార్పొరేటర్లు పొందిన వివిధ భత్యాలు, గౌరవ వేతనం తిరిగి బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, గత ఎన్నికల్లో అనర్హత వేటు పడిన మొత్తం 24 మంది కార్పొరేటర్లలో 12 మంది ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. అనిల్‌ గల్‌గలే అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బీఎంసీ అకౌంట్స్‌ విభాగం నుంచి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ బకాయిల విషయం బయటకు వచి్చంది. దీంతో బకాయిలు చెల్లించని ఆ 12 మంది మాజీ కార్పొరేటర్ల ఆస్తులు జప్తు చేయాలని అనిల్‌ గల్‌గలే బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ను డిమాండ్‌ చేశారు.   
 

పేరు పార్టీ పార్టీ బకాయిలు(రూ. లక్షల్లో)
ముర్జీపటేల్‌ బీజేపీ 5.64 
కేశర్‌బేన్‌పటేల్‌ బీజేపీ 5.64
భావన జోబన్‌పుత్ర బీజేపీ 3.49
రాజపతి యాదవ్‌  కాంగ్రెస్‌  5.64  
కిణీ మారిస్‌ కాంగ్రెస్‌ 4.84 
భారతీ ధోంగడే కాంగ్రెస్‌ 1.81
సుగుణ నాయిక్‌ శివసేన 3.55
అనుషా కోడం శివసేన 0.37
సునీల్‌ చవాన్‌ శివసేన 0.93 
నాజీయా సోఫీ ఎన్సీపీ  7.21
చంగేజ్‌ ముల్తాని ఇండిపెండెంట్‌ 0.79 
అంజుమ్‌ అస్లం ఇండిపెండెంట్‌ 0.45

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement