శ్రీరామనవమి వేడుకల్లో ప్రమాదం.. గుడిపైకప్పు కూలి బావిలో పడ్డ భక్తులు

MP Indore Mahadev Jhulelal Temple Accident Updates - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయినట్లు సమాచారం. 

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది భక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 17 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు. పైకప్పు శిథిలాల కింద బావిలో భక్తులు ఇరుక్కుని ఉండడంతో.. వాళ్లను రక్షించడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్తున్నారు.  ప్రస్తుతం  రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

తొలుత స్థానికులు వాళ్లను బయటకు తీసేందుకు యత్నించారు. కొందరిని రక్షించగలిగారు. ఈలోపు పోలీసులు, వైద్య సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top