న్యూఢిల్లీ: బెన్నెట్ కోల్‌మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), ఆ సంస్థ బోర్డు సభ్యుడైన మోహిత్ జైన్ 2026–27కుగాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రముఖ దినపత్రికలు ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్‌ను ప్రచురించే బీసీసీఎల్.. ఈ ఎన్నిక ద్వారా 43 ఏళ్ల తర్వాత మళ్లీ ఏబీసీ చైర్మన్ పదవిని పొందింది.
అలాగే ప్రముఖ మీడియా ఏజెన్సీ మాడిసన్ వరల్డ్ పార్ట్‌నర్, డైరెక్టర్ అయిన విక్రమ్ సఖుజా ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏబీసీ సెక్రటరీ జనరల్‌గా అదిల్ కసద్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎంబీఏతోపాటు కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన జైన్‌కు ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
బీసీసీఎల్‌లో ఆయన పబ్లిషింగ్, బిజినెస్ ఆపరేషన్లను ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. బీసీసీఎల్‌ఓ చేరడానికి ముందు, ఆయన జీఎస్‌కే కన్సూ్యమర్ హెల్త్‌కేర్ ఇండియా మేనేజ్‌మెంట్ టీమ్‌లో భాగస్వామిగా ఉన్నారు. అలాగే 2021–22కుగాను ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) అధ్యక్షుడిగా పనిచేశారు.


