breaking news
BCCL
-
భారత్ కోకింగ్ కోల్‌కు యాంకర్ నిధులు
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ కంపెనీ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 273 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన ప్రధాన సంస్థలలో మ్యూచుకల్ ఫండ్స్.. బంధన్, నిప్పన్ ఇండియా, యూటీఐసహా, ఎల్ఐసీ, సిట్రీన్ ఫండ్, సొసైటీ జనరాలి ఓడీఐ, మేబ్యాంక్ సెక్యూరిటీస్ తదితరాలున్నాయి.నేడు(9న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 21–23 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 13న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 23 ధరలో 11.87 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. ఇష్యూలో భాగంగా మాతృ సంస్థ కోల్ ఇండియా 46.57 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా రూ. 1,071 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ లిస్టింగ్‌లో రూ. 10,700 కోట్ల విలువ సాధించే అవకాశముంది.వెరసి కొత్త కేలండర్ ఏడాదిలో తొలి ఐపీవోగా బీసీసీఎల్ నిలవనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈ నెల 16న లిస్ట్‌కానుంది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ నివేదిక ప్రకారం కోకింగ్ కోల్ ఉత్పత్తిలో గతేడాది(2024–25) బీసీసీఎల్ అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ఈ కాలంలో ఆదాయం రూ. 13,802 కోట్లుకాగా.. రూ. 1,204 కోట్ల నికర లాభం ఆర్జించింది.కార్యకలాపాల విస్తరణ 1972లో ఏర్పాటైన బీసీసీఎల్ ప్రధానంగా స్టీల్, విద్యుత్ పరిశ్రమల్లో వినియోగించే కోకింగ్ కోల్, నాన్‌కోకింగ్ కోల్, వాష్డ్ కోల్ ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ తొలుత ఝరియా(జార్ఖండ్), రాణిగంజ్(పశి్చమ బెంగాల్) గనుల నుంచి కోకింగ్ కోల్ సరఫరా కోసం ఏర్పాటైంది. తదుపరి కాలంలో భారీస్థాయిలో కార్యకలాపాలు విస్తరించింది. 2025కల్లా 40.50 మిలియన్ టన్నుల కోల్‌ను ఉత్పత్తి చేసింది.2022లో సాధించిన 30.51 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 33 శాతం వార్షిక వృద్ధి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి ఆరు నెలల్లో 15.75 మిలియన్ టన్నుల కోల్‌ను ఉత్పత్తి చేసింది. అయితే గతేడాది ఇదే కాలం(ఏప్రిల్–సెపె్టంబర్)లో ఉత్పత్తి చేసిన 19.09 మిలియన్ టన్నులతో పోలిస్తే క్షీణత నమోదైంది. 2025 సెపె్టంబర్‌కల్లా 34 గనులను నిర్వహిస్తోంది. వీటిలో 4 భూగర్భంలోనివికాగా.. 26 ఓపెన్‌కాస్ట్ గనులు. -
అమ్మకానికి మరో ప్రభుత్వ రంగ సంస్థ వాటా!
అన్‌లిస్టెడ్ అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్(బీసీసీఎల్)లో 25 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా తెలియజేసింది. తదుపరి తగిన అనుమతులు లభిస్తే బీసీసీఎల్‌ను స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మార్చి 10న జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. బొగ్గు శాఖ(ఎంవోసీ) సూచనలమేరకు బీసీసీఎల్‌లో 25శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ముందస్తు అనుమతిని మంజూరు చేసినట్లు పేర్కొంది. తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టింగ్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ అంశంలో మరిన్ని అనుమతుల కోసం ఎంవోసీకి ప్రతిపాదించినట్లు వెల్లడించింది. అయితే బోర్డు సూచనప్రాయ అనుమతిని మాత్రమే మంజూరు చేసిందని, ఎంవోసీ నుంచి క్లియరెన్స్ లభిస్తే లిస్టింగ్ సన్నాహాలు చేపడతామని వివరించింది. 2020–21లో 37.13 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 24.66 ఎటీ ఉత్పత్తిని మాత్రమే బీసీసీఎల్ సాధించినట్లు ఈ సందర్భంగా కోల్ ఇండియా వెల్లడించింది. -
కోల్ ఇండియా సబ్సిడరీల వికేంద్రీకరణ..!
గోదావరిఖని: కోల్ ఇండియాను వికేంద్రీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దేశంలో బొగ్గు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో కోల్ ఇండియాలోని ఏడు సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకుని వాటిని ఆయా రాష్ట్రాలకే అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోల్ ఇండియా పరిధిలో జార్ఖండ్‌లో బీసీసీఎల్ (భారత్ కోకింగ్ కోల్ లిమిడెట్), సీసీఎల్ (సెంట్రల్ కోల్ లిమిటెడ్), పశ్చిమబెంగాల్లో ఈసీఎల్ (ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), ఒడిశాలో ఎంసీఎల్ (మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), మధ్యప్రదేశ్‌లో ఎన్సీఎల్ (నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), ఛత్తీస్‌గఢ్‌లో ఎస్ఈసీఎల్ (సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్), మహారాష్ట్రలోని డబ్ల్యూసీఎల్ (వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్) సంస్థలు బొగ్గు ఉత్పత్తి సాగిస్తున్నాయి. ఈ సంస్థలన్నీ కోల్‌కతా కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. దేశంలో బొగ్గు కొరత..: ఆరు రాష్ట్రాల్లో కోల్ ఇండియా ఏడు సబ్సిడరీ సంస్థలకు చెందిన 272 భూగర్భ గనులు, 168 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా ఏటా 450 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దేశ అవసరాలకు సుమారు 600 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం అవుతుండగా, 150 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో 119 కోల్‌బ్లాక్‌లను క్యాప్టివ్‌మైన్స్ (ఆయా కంపెనీలు తమ అవసరాల కోసం బొగ్గును వెలికితీయడం)గా మార్పు చేసింది. కానీ, తమకు కేటాయించిన గనుల్లో చాలా కంపెనీలు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోలేదు. టెండర్లు లేకుండా ప్రైవేట్ కంపెనీలకు కోల్‌బ్లాక్‌లను అప్పగించడంపై ఆరోపణలు రావడంతో కొన్ని బ్లాక్‌లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తి ఆశించిన మేర జరగలేదు. ఆయా రాష్ట్రాల్లో బొగ్గు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గనులను ప్రారంభించేందుకు ప్రజలు సహకరించకపోవడం పెద్ద సమస్యగా మారింది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్రక్రియకు సహకరించ ని పరిస్థితి. దీంతో నరేంద్రమోడీ ప్రభుత్వం కోల్ ఇండియాలోని సబ్సిడరీ సంస్థలను వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త గనుల ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కేంద్రం నుంచి ఇప్పించినప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ వంటి పనులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ కోల్ ఇండియాలోని సంస్థల్లో ఆయా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదే కోవలోకి సింగరేణి..? తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49%వాటా ఉంది. దీనిపై 51% వాటా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కోల్ ఇండియా సబ్సిడరీ సంస్థలకు ఇచ్చిన విధంగానే 49% వాటాలో మరికొంత వాటాను తెలంగాణ రాష్ట్రానికి విక్రయించాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఈ విషయమై సీఎం కేసీఆర్ కేంద్రం వద్ద ఈ ప్రతిపాదన తీసుకురాగా, సానుకూలత వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వం వాటాను పూర్తిగా కొనుగోలు చేసి రాష్ట్ర పరిధిలోకి తీసుకురావాలంటూ ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. సింగరేణి సంస్థ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.12,300 కోట్లుగా అంచనా.


