తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక రైళ్లు

Modern Trains for Telugu States in 150 Routes, Complete Details - Sakshi

కేంద్రమంత్రి పీయూష్‌ వెల్లడి 

12 క్లస్టర్లలో పీపీపీ పద్ధతిలో  రైళ్లు

సతీశ్‌చంద్ర దూబే ప్రశ్నకు సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులను ఆకర్షించడానికి 150కిపైగా మార్గాల్లో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీపీపీ)లో ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ నవంబర్‌ 2020లో ప్రతిపాదనలు చేసిందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. బీజేపీ సభ్యుడు సతీశ్‌చంద్ర దూబే ప్రశ్నకు ఆయన శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 12 క్లస్టర్లలో పీపీపీ పద్ధతిలో నడిచే రైళ్లు ఎంపిక చేశామన్నారు. సికింద్రాబాద్‌ తదితర క్లస్టర్లలో తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల మీదుగా పీపీపీ పద్ధతిలో 25 మార్గాల్లో 50 ఆధునిక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top