ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేసిన కేంద్రం.. ఆ ఆరోపణలే కారణం

MHA Suspended IAS Officer Jitendra Narain - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి జీతేంద్ర నారాయణ్‌ను సస్పెండ్ చేసింది కేంద్ర హోంశాఖ. ఓ మహిళను ఆయన లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో నివేదికను పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జేతేంద్రపై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి(యూటీ డివిజన్‌) అశుతోష్ అగ్నిహోత్రి ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

1990 బ్యాచ్‌కు చెందిన జీతేంద్ర నారాయణ్ అండమాన్ నికోబార్‌లో ఓ మహిళను వేధించారని ఇటీవల అరోపణలు వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసుల నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ. జీతేంద్రపై వచ్చిన ఆరోపణలు నిజమే అని ఆదివారం అందిన నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఆ మరునాడే చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. జీతేంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

ఉన్నత హోదాలో ఉండి అధికార దుర్వినియోగానికి, ప్రత్యేకించి మహిళలపై వేధింపులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.  జీతేంద్ర నారాయణ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులతో పాటు, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది.
చదవండి: కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top