కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి

Congress New Chief Should Consider Gandhis Views Chidambaram - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీలో గాంధీ కుటుంబం ఉనికిని ఏ మాత్రం ప్రభావితం చేయవని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిందరం అభిప్రాయపడ్డారు. కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు చేపట్టిన గాంధీల సలహాలు, సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీల చేతిలోనే ఉంటుందనే ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. జిల్లా స్థాయిలో ఓటింగ్ జరిగి అధ్యక్షుడ్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది పార్టీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఖర్గే గాంధీల విధేయుడని, ఆయన గెలిచినా నడిపించేది గాంధీలేనని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో చిదంబరం స్పందించారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టేవారు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకులను ఎన్నుకునేలా చేయాలని, పార్టీలో మార్పులు తీసుకురావాలని తాజాగా సూచించారు.

మరోవైపు తాను గెలిస్తే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తానని పోటీకి ముందే శశిథరూర్. ఖర్గే కూడా పార్టీలో యువతకే ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. గాంధీల నుంచి విలువైన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్‌లో ఎవరు గెలుస్తారో బుధవారం తెలిపోనుంది. ఆరోజే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
చదవండి: ముగిసిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌.. 96% ఓటింగ్‌ నమోదు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top