Meghalaya CM Conrad Sangma Chopper Makes Emergency Landing In Umiam - Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. సీఎం ట్వీట్‌ వైరల్‌

Nov 2 2022 7:37 PM | Updated on Nov 2 2022 7:56 PM

Meghalaya CM Conrad Sangma Chopper Makes Emergency Landing - Sakshi

ఎంత సాహసం! వాతావరణం అనుకూలించక ఉమియామ్‌లోని యూసీసీలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.

షిల్లాంగ్‌: వాతావరణం అనుకూలించకపోవటంతో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. షిల్లాంగ్‌లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌ దిగాల్సి ఉండగా.. వాతావరణం అందుకు అనుకూలించలేదు. దీంతో ఉమియామ్‌ సరస్సు సమీపంలో ల్యాండింగ్‌ చేశారు పైలట్లు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు సీఎం కాన్రాడ్‌ సంగ్మా. తురా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన ఎదురైనట్లు పేర్కొన్నారు.

హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసిన యూనియన్‌ క్రిస్టియన్‌ కాలేజీ క్యాంపస్‌లోని పర్యావరణాన్ని ఆస్వాదించానని పేర్కొన్నారు సంగ్మా. తమను సురక్షితంగా కిందకు చేర్చినందుకు హెలికాప్టర్‌ కెప్టెన్‌, పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎంత సాహసం! వాతావరణం అనుకూలించక ఉమియామ్‌లోని యూసీసీలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. క్యాంపస్‌లోని అందమైన ప్రకృతిని ఆస్వాదించాను. యూసీసీ సిబ్బందిని కలిశాను. అక్కడి క్యాంటీన్‌లో మధ్యాహ్న భోజనం చేశాను.’ అని రాసుకొచ్చారు సంగ్మా.

ఇదీ చదవండి: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా

Advertisement
 
Advertisement
Advertisement