Chhattisgarh Encounter: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

Published Wed, Mar 27 2024 11:11 AM

Massive Encounter in Bijapur Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌: స్వల్ప రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. బీజాపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయి​స్టు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

బుధవారం ఉదయం బాసగూడ ప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు  భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు బలగాలు ప్రకటించుకున్నాయి.

ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు ముగ్గురు స్థానికులను హతమార్చారు. దీంతో.. భద్రతా బలగాలు మావో​యిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగించిన క్రమంలోనే ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 

మరోవైపు ఛ‌త్తీస్‌గ‌ఢ్ అడవుల్లో ఇటీవల వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పీడియా అట‌వీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు, అంతకు ముందు చోటేతుంగాలి అట‌వీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Advertisement
 
Advertisement
 
Advertisement