ఆప్‌ అభ్యర్థి కిడ్నాప్‌!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా

Manish Sisodia Alleges BJP Kidnapped AAP Gujarat Candidate Missing - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీపై ఆప్‌ నేత ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో బీజేపీ గుజరాత్‌లోని తమ ఆప్‌ అభ్యర్థిని కిడ్నాప్‌ చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గుజరాత్‌లోని సూరత్‌ నుంచి పోటీ చేస్తున్న కంచన్‌ జరీవాలా అనే ఆప్‌ అభ్యర్థిని బీజేపి కిడ్నాప్‌ చేసిందంటూ ఆరోపణలు గుప్పించారు.

కంచన్‌, అతని కుటుంబం నిన్నటి నుంచి కనబడకుండ పోయిందని అన్నారు. నామినేషన్‌ వెరిఫికేషన్‌ ముగించుకుని బయటకు వచ్చిన మరుక్షణం అయన్ని బీజేపీ గుండాలు కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారంటూ విరుచుకుపడ్డారు. ఆయన ఇప్పుడూ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదంటూ సిసోడియా ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో పలువురు ఆప్‌నేతలు ఇది ప్రమాదకరం అని, ప్రజాస్వామ్యాన్ని అపహరించడమేనని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా...తొలుత కాంచన్‌ నామినేషన్‌ని తిరస్కరించారు. ఆ తర్వాత కంచన్ నామినేషన్‌కి ఆమోదం లభించిన వెంటనే ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అందువల్లే అతన్ని కిడ్నాప్‌ చేశారా? అని బీజేపీని  కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

(చదవండి: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. శశిథరూర్‌కు ఘోర అవమానం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top