
అగర్తలా: త్రిపుర కొత్త సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా(69)ను బీజేపీ అధిష్టానం ఖరారుచేసింది. దీంతో ఆయన ముఖ‍్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
అయితే, సాహా ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్ బాధ్యతలతో పాటుగా త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా, ఆయన 2016లో బీజేపీలో చేరారు. ఇక, రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. అంతకు ముందు సీఎంగా ఉన్న బిప్లవ్ దేవ్ అధిష్టానం ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: చైనా అధ్యక్ష పదవికి జిన్‌పింగ్ రాజీనామా.. ఆయనకు పగ్గాలు..?