
యశవంతపుర: కరోనాతో మృతి చెందిన అమ్మ మృతదేహాన్ని కొడుకు ఆటోలో సొంతూరికి తీసుకెళ్లాడు. మండ్య జిల్లా వళవళ్లికి చెందిన శారదమ్మ అనే మహిళకు కరోనా సోకడంతో తనయుడు శివకుమార్ సొంత ఆటోలో బెంగళూరుకు తీసుకొచ్చాడు. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఏదో ఒక సాకు చెప్పి చేర్చుకోలేదు. చివరకు ఆమె ఆటోలోనే కన్నుమూయడంతో శివకుమార్ తల్లిని కాపాడుకోలేకపోయానే అని కన్నీరుమున్నీరయ్యాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంతూరికి తీసుకెళ్లాలని అడిగితే తిరస్కారమే ఎదురైంది. దీంతో ఆటోలోనే బయల్దేరాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో నాయండళ్లి వద్ద పోలీసులు ఆపి పరిశీలించగా అతని కన్నీటిగాథ బయటపడింది.