Gujarat:తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లింది.. చివరికి ఏమైందంటే!

Man Survives Miraculously As Tractor Moves Over His Head In Viral Video - Sakshi

గాంధీనగర్‌: ఇటీవల గుజరాత్‌లోని దాహోద్‌లో టూవీలర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సును ఓవర్‌టేక్‌ చేస్తూ ప్రమాదం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అలాంటి షాకింగ్‌ ఘటనే మరోసారి దాహోద్‌లో చోటుచేసుకుంది. ఈసారి ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దహోద్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి బైక్ ఒక మహిళ, చిన్నారితో కలిసి వెళ్తున్నాడు. రోడ్డుపై వర్షపు నీరు చేరి ఉండటంతో నీటిలో గుంత కారణంగా వారి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు కుడివైపుకు పడిపోయారు. 

అంతలోనే బైక్‌పై ఉన్న ముగ్గురు పక్కన వెళ్తున్న ట్రాక్టర్‌ కింద పడిపోయారు. అయితే ట్రాక్టర్ టైర్ ఫోర్స్‌కు మహిళ, శిశువు దూరంగా నెట్టివేయబడ్డారు. కానీ ఆ వ్యక్తి  తలపై మాత్రం ట్రాక్టర్‌ వెనక టైర్‌ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. అది కూడా పక్కకు జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో అతడు మరణించి ఉంటాడని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ
ట్రైన్‌ జర్నీలో యువకుడి డేంజరస్‌ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు
షాకింగ్‌: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top