Bengaluru Man Receives RS 22 Lakh Repair Estimate For Rs 11 Lakh Worth Car - Sakshi
Sakshi News home page

విచిత్ర సంఘటన.. కారు విలువ రూ.11 లక్షలు.. రిపేరుకు రూ.22 లక్షలు!

Published Sun, Oct 2 2022 10:42 AM

Man Receives RS 22 Lakh Repair Estimate For Rs 11 Lakh Worth Car - Sakshi

సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్‌ కోసం సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్‌ స్లిప్‌ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్‌వాగన్‌ పోలో హ్యాచ్‌బ్యాక్‌ కారును రిపేర్‌ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్‌ఇన్‌లో షేర్‌ చేశారు అనిరుధ్‌ గణేశ్‌. 

బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్‌ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్‌ పనిచేయటం లేదు. దాంతో వోక్స్‌వాగ్‌ సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు గణేశ్‌. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్‌ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన‍్సూరెన్స్‌ సంస్థను సంప్రదించారు గణేశ్‌. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్‌ సెంటర్‌ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్‌ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్‌వాగన్‌ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్‌. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది.

కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్‌ స్లిప్‌

ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్:‍ హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ

Advertisement
Advertisement