భిక్షాటన చేసే ట్రాన్స్‌వుమన్‌తో  ప్రేమాయణం.. భార్య అంగీకారంతో పెళ్లి..

Man Marries Transwoman In Odisha But With Wifes Consent - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా కలాహాండీ జిల్లాలో ట్రాన్స్‌వుమన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 32 ఏళ్ల వ్యక్తి. అయితే అతనికి అప్పటికే మరో మహిళతో వివాహమైంది. రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మొదటి భార్య ఒప్పుకోవడమే గాక.. ట్రాన్స్‌వుమన్‌ కూడా తమతో పాటు ఒకే ఇంట్లో ఉండేందుకు అనుమతించడం గమనార్హం.

అలామొదలైంది..
ట్రాన్స్‌వుమన్‌ను గతేడాది రాయగడ జిల్లా అంబడోలాలో చూశాడు ఈ వ్యక్తి. రోడ్డుపై భిక్షాటన చేసే ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడిపోయాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత రోజూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది.

అయితే నెల రోజుల క్రితం ఈ వ్యక్తి భార్య అతని ఫోన్‌ను చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. రోజూ ట్రాన్స్‌వుమెన్‌తో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడ్ని భార్య నిలదీసింది. ఇక చేసేదేంలేక అతను నిజం ఒప్పుకున్నాడు. ట్రాన్స్‌వుమన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె తనుకు చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. దీంతో భార్య వారి రిలేషన్‌కు అంగీకరించింది. పెళ్లి చేసుకుంటామంటే ఓకే చెప్పింది. భార్య అంగీకారంతో ట్రాన్స్‌వుమన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.

రెండో పెళ్లి చెల్లదు..
అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా అది చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. భర్త మాత్రం తమ కుటుంబమంతా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నాడు. చట్టాల గురించి తాము పట్టించుకోమని పేర్కొన్నాడు.
చదవండి: అంబులెన్సులా మారిన బుల్‌డోజర్.. వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top