
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన భార్య అనారోగ్యం కారణంగా చనిపోవడంతో.. ఆమె చెల్లిని భర్త పెళ్లి చేసుకున్నారు. అనంతరం, చనిపోయిన భార్య.. రెండో సోదరిని సైతం తనకు ఇచ్చి పెళ్లి చేయాలని సెల్ టవర్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. దీంతో, అల్లుడి ఏమైనా చేసుకుంటాడు అనే భయంతో అత్తమామలు అతడితో పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన రాజ్ సక్సేనాకు 2021లో ఒక మహిళతో వివాహం జరిగింది. ఆమెకు చెల్లెలు ఉన్నారు. అయితే, ఆమెకు వివాహం జరిగిన ఏడాదికే అనారోగ్యం కారణంగా చనిపోయింది. దీంతో, తమ రెండో అమ్మాయిని ఇచ్చి.. రాజ్‌కు అత్తామామలు పెళ్లి చేశారు. అయితే, ఇప్పుడు తాజాగా తన మరదలిని కూడా తాను పెళ్లి చేసుకుంటానని ట్విస్ట్ ఇస్తూ పెళ్లి ప్రపోజల్‌ను అత్తామామలకు చెప్పాడు. కానీ, ఇందుకు వారు నిరాకరించారు.
#Kannauj-साली से शादी करने की जिद पर अड़ा जीजा
शादी की जिद में जीजा एचटी टावर पर चढ़ा
टावर पर चढ़कर युवक का हाईवोल्टेज ड्रामा
साली से शादी की जिद पर पत्नी से विवाद
मौके पर पुलिस युवक को उतारने में जुटी
छिबरामऊ कोतवाली के रसूलपुर का मामला। pic.twitter.com/vcLd3IjTZJ— Khabar Times Today (@YogeshS10562111) August 28, 2025
ఈ క్రమంలో తన మరదలిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన రాజ్ సక్సేనా.. గురవారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో, హుటాహుటినా కుటుంబ సభ్యులకు అక్కడికి చేరుకుని రాజ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. దాదాపు ఏడు గంటల పాటు.. పోలీసులు, అతని కుటుంబ సభ్యులు కిందకు రమ్మని ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో, చేసేదేమీ లేక.. మూడో కూతురితో కూడా వివాహం చేయడానికి వారు అంగీకరించారు. అనంతరం, టవర్ దిగి రాజ్ కిందకు వచ్చారు. ఈ సందర్భంగా ారాజ్ సక్సేనా మాట్లాడుతూ.. తన మరదలికి కూడా తానంటే ఇష్టమే అని చెప్పాడు. ఆమె తనను ప్రేమిస్తున్నట్టు తెలిపాడు. ఇక, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.