బట్టల తీగకు కరెంట్‌.. కాపాడబోయి భార్య, అత్త కూడా.. | Sakshi
Sakshi News home page

గాలి దుమారంతో బట్టల తీగకు తాకిన కరెంట్‌ వైర్‌.. భర్తను కాపాడబోయి భార్య, అత్త కూడా..

Published Mon, May 15 2023 9:24 PM

Man electrocuted while drying clothes wife Her Mother Also Died - Sakshi

క్రైమ్‌: బట్టలు ఆరేసుకునే తీగకు కరెంట్‌ వైర్‌ తగలడం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలి తీసుకుంది. ఇజార్‌ అక్తర్‌ అనే వ్యక్తి ఆదివారం ఉదయం బట్టలు ఆరేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆ ఇనుప తీగకు గాలిదుమారం కారణంగానే ఆ పక్కనే ఉన్న కరెంట్‌ తీగ తగిలింది. 

దీంతో ఇజార్‌కు కరెంట్‌ షాక్‌ కొట్టగా.. విలవిలలాడిపోయాడు. అది గమనించిన భార్య ముంతాహ బేగం, ఆమె తల్లి ఖైరుల్‌ నెస్సా, ఇజార్‌ను ఆలస్యం చేయకుండా రక్షించేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాళ్లిద్దరికీ కరెంట్‌ షాక్‌ తగిలింది. వాళ్లిద్దరూ అక్కడికక్కడే మరణించారు. అయితే.. 

ఇజార్‌కు మాత్రం కరెంట్‌ షాక్‌తో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇజార్‌ కన్నుమూశాడు. కోల్‌కతా(పశ్చిమ బెంగాల్‌) ఏక్‌బల్‌పోర్‌లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన విషాదం నింపింది.

ఇదీ చదవండి: గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్

Advertisement
Advertisement