పెళ్లికి ముందు వరుడు అరెస్టు..దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన కాబోయే భార్య!

Man Arrested Before His Wedding Fiancee Complaint For Fake Identity - Sakshi

రేపు పెళ్లి అనంగా ఒక వ్యక్తి అరెస్టు అ‍య్యాడు. అతని నిజ స్వరూపాన్ని కాబోయే భార్య బట్టబయలు చేసింది. ఈ ఘటన గ్రేటర్‌ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా పరిధిలోని దాద్రీలో  నివాసం ఉంటున్న హసిన్‌ సైఫీ అనే వ్యక్తి ఒక ఒక మహిళకు తన పేరు ఆశిష్‌ ఠాకూర్‌గా(నకిలీ పేరుతో) పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

ఒక రోజు ఆమెకు ఉద్యోగం పోయింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆశిష్‌ ఆమె ఉంటున్న ఫ్లాట్‌కి వచ్చి ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక కొద్దిరోజులకే పెళ్లి చేసు‍కోవాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వారి పెళ్లి ఈ నెల డిసెంబర్‌ 12న జరగాల్సి ఉంది. ఐతే ఆ జంట ఇంట్లో లేనప్పుడు ఒక పెద్దాయన తన కొడుకు హసన్‌ ఆచూకీ కోసం ఇరుగుపోరుగు వారిని ఆరా తీశాడు.

ఐతే ఇక్కడ ఆశిష్‌ అనే వ్యక్తి ఇటీవలే కొత్తగా వచ్చి ఉంటున్నాడని హసన్ కాదని వారు చెప్పారు. ఈ విషయం సదరు మహిళ తెలుసుకుని ఆ పెద్దాయనను కలుసుకుంది. ఆయన ద్వారా అతడి పేరు ఆశిష్‌ కాదని హసీన్‌  సైఫీ అని తెలుసుకోవడమే గాక అతడి చేసిన మోసం అంతా తెలుసుకుని షాక్‌ తింటుంది. దీంతో ఆమె తనను మోసం చేయడమేగాక బలవంతంగా పెళ్లిచేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) దినేష్ కుమార్ తెలిపారు.

(చదవండి: పెళ్లైపోతుందనంగా... వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్‌ చేస్తూ...)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top