Love Couple Commits Suicide At Karnataka, Reasons And Details Inside - Sakshi
Sakshi News home page

Karnataka Lovers Suicide: ప్రేమజంట ఆత్మహత్య.. కారణం అదేనా..?

Jun 30 2022 7:35 AM | Updated on Jun 30 2022 9:37 AM

Love Couple Commits Suicide At Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొరాపుట్‌: ఒకే చెట్టు కొమ్మకు ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన నబరంగ్‌పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని డాబుగాం పోలీస్‌స్టేషన్‌ పరిధి పపడాహండి సమితి జబాగుడ గ్రామ సమీపంలోని జీడితోటలో అదే గ్రామానికి చెందిన తిలై హరిజన్‌(18), దమాపల్లి గ్రామానికి చెందిన డోంబురు హరిజన్‌(19)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

వీరిద్దరూ మంగళవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో గ్రామస్తులు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించారు. మృతురాలి అన్న మృతుడి అక్కను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బంధువులు అయినప్పటికీ వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.   

(మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com)

ఇది కూడా చదవండి: మీరు నాకు నచ్చారు.. పెళ్లి చేసుకుందాం.. చివరికి ఊహించని ట్విస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement