బడ్జెట్‌ సమావేశాలపై బులెటిన్‌ విడుదల | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ సమావేశాలపై బులెటిన్‌ విడుదల

Published Tue, Jan 25 2022 6:26 AM

Lok Sabha, Rajya Sabha to operate in separate shifts during Budget session - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా లోక్‌సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌ నాధ్‌ కోవింద్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్‌ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. 

Advertisement
 
Advertisement