Lalu Prasad Can Inaugurate 6 Ton Lantern in Patna - Sakshi
Sakshi News home page

వామ్మో!! ఆరు టన్నుల లాంతర్‌ ఆవిష్కరణ!!

Nov 23 2021 10:35 AM | Updated on Nov 23 2021 10:54 AM

Lalu Prasad Can Inaugurate 6 Ton Lantern In Patna  - Sakshi

Lalu Prasad can inaugurate 6 ton lantern: ఈ రాజకీయ నాయకులు వినూత్నంగా చేసే కొన్ని పనులు భలే ఫేమస్‌ అవుతాయి. పైగా తమ అభిమాన నాయకుడే ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో వారి పార్టీ శ్రేణులు కొన్నింటిని భలే విన్నూతన రీతిలో వస్తువులు లేదా భవనాలను తయారుచేయడం లేదా కట్టించడం వంటి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తమ అభిమాన నాయకుడు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో ఒక భారీ లాంతరు ఏర్పాటు చేశారు.

(చదవండి: 2070 నాటి కల్లా భారత్‌ కార్బన్‌ న్యూటల్‌ దేశంగా మారాలి: నితిన్‌ గడ్కరీ)

అసలు విషయంలోకెళ్లితే....పాట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో వారి పార్టీ చిహ్నం అయిన 6 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఒక భారీ లాంతరును ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలో లాంతరును ఆవిష్కరించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంగణంలోకి ప్రవేశంపై నిషేధం కూడా విధించారు. అయితే ఈ లాంతర్‌ని తేజస్వి  యాదవ్ అనే వ్యక్తి చొరవతోనే ఈ లాంతరును నిర్మించినట్లు ఆర్జేడీ కార్యకర్తలు చెబుతున్నారు.

బంకా జిల్లా ట్రెజరీకి సంబంధించిన డబ్బు కుంభకోణం సంబంధించిన కేసు కోసం లాలు ప్రసాద్‌ యాదవ్‌ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరై నిమిత్తం పాట్నా వస్తున్నారు. అందువల్ల ఆ సమయంలోనే ఈ ఆవిష్కరణ జరిగే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆవిష్కరణతో పాటు పార్టీ అధినేత పాట్నా పర్యటన తర్వాత కుల గణన అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

(చదవండి: ఇంట్లో వీల్‌చైర్‌లా... బయట స్కూటీలా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement