Norovirus: కేరళలో కొత్త వైరస్‌ కలకలం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

Kerala Confirms 2 Cases of Norovirus In Childrens - Sakshi

తిరువనసంతపురం: కేరళలో కొత్త వైరస్‌ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్‌ కేసులను గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ నోరోవైరస్‌ సోకినట్లు పేర్కొంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ఇద్దరు పిల్లల పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆందోళన చెందనవసరం లేదు
విజింజంలోని ఎల్‌ఎంఎస్‌ఎల్‌పీ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజనింగ్‌, డయేరియాతో విద్యార్థులు బాధపడుతున్నారని తెలియడంతో వారి నుంచి నమూనాలు సేకరించామని మంత్రి తెలిపారు. నమూనాలను పరీక్ష కోసం రాష్ట్ర ప్రజారోగ్య ల్యాబ్‌కు పంపిమని, అయితే సదరు పరీక్షలో ఇద్దరికి నోరోవైరస్  ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ పరిస్థితిని అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. కాగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ లక్షణాలు కనిపించాయని అధికారులు అనుమానిస్తున్నారు.
చదవండి: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం

నోరోవైరస్ అంటే
నోరోవైరస్ అనేది అంటువ్యాది. ఇది తీసుకున్న ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరోవైరస్ సోకిన ఉపరితలాలు, వస్తువులను తాకడం లేదా వైరస్‌ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు.  నోరో వైరస్‌ సోకిన రోగులు వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండాలని, లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి జాత్రత్తలు పాటించాలని వైద్యులు  సూచించారు.

ముందుగా అప్పుడే
నవంబర్ 2021లో కేరళలో మొదటిసారిగా నోరోవైరస్ కేసులు నమోదయ్యాయి. వాయనాడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులు  పాజిటివ్‌గా పరీక్షించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అదుపులోకి తెచ్చింది. ఆ తర్వాత వ్యాప్తి చెందలేదు. తాజాగా మరోసారి కేసులు వెలుగుచూశాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top