ఆ మంత్రి ఆ కేసు గురించే అరెస్టు అయ్యారా? తెలియదని మాటదాటేసిన నితీష్‌

Kartikeya Singh Arrest Now Aware Nitish Kumar Said - Sakshi

పాట్న: బిహార్‌లో నితీష్‌ కుమార్‌ బీజేపీ గుడ్‌ బై చెప్పీ ఆర్జేడితో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌ కొత్త ప్రభుత్వంలోని న్యాయశాఖ మంత్రి కార్తికేయ సింగ్‌ని అరెస్ట్‌ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయమై విలేకరులు బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ని ప్రశ్నించగా నాకు తెలియదని చెప్పారు.

డిప్యూటీ సీఎం పార్టీకి చెందిన కార్తికేయ సింగ్‌ని కిడ్నాప్‌ కేసు విషయమై అరెస్టు చేశారా అంటూ మీడియా పలుమార్లు నిలదీయగా...నాకేమి తెలియదంటూ మాట దాటవేశారు. నితీష్‌ కుమార్‌ ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వంలో కార్తికేయం ఆగస్టు 16న మంత్రిగా ప్రమాణా స్వీకార చేశారు. ఆ  రోజునే ఆయన కోర్టులో సరెండర్‌ అయ్యారు.

బిహార్‌ అసెంబ్లీ సభ్యుడైన కార్తికేయ సుమారు 17 మందితో కలిసి 2014లో ఒక బిల్డర్‌ని కిడ్నాప్‌చేసి హత్య చేసినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఐతే ఆయన మాత్రం తప్పుడు అభియోగాలతో తనపై కేసు పెట్టారని, తనపై ఎలాంటి వారెంట​ లేదని చెప్పడం గమనార్హం.

(చదవండి: కొలువుదీరిన నితీశ్‌ కేబినెట్‌.. మంత్రులుగా 31 మంది ప్రమాణ స్వీకారం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top