
రామ్‌నగర్: కర్నాటకలోని రామ్‌నగర్ పట్టణంలో కలకలం రేపే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఆటోమొబైల్ కంపెనీ(Automobile company)లోని టాయిలెట్ గోడలపై పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాసిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిని అహ్మద్ హుస్సేన్, సాదిక్‌లుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం రామ్‌నగర్ పరిధిలోని బిడ్డీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడి టొయోటా ఆటోమొబైల్(Toyota Automobile) కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ మార్చి 15న కంపెనీ నోటీసు బోర్డులో ఒక నోటీసు అతికించారు. ఈ నోటీసులో ఫ్యాక్టరీ లోపలున్న టాయిలెట్ గోడలపై పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదారుల రాయడాన్ని గుర్తించామని పేర్కొన్నారు. ఇలా రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దానిలో హెచ్చరించారు.
ఈ ఉదంతంపై కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కంపెనీలో ఏడాదిగా కంట్రాక్ట్‌పై పనిచేస్తున్న అహ్మద్ హుస్సేన్, సాదిక్ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని తెలిపారు. రామ్‌నగర్ ఎస్సీ శ్రీవాస్తవ్ మాట్టాడుతూ ఒక ప్రవేట్ కంపెనీలో పాక్‌కు మద్దతుగా నినాదాలు రాసినవారిని పట్టుకున్నామని, సెక్షన్ 67 ప్రకారం వారిపై కేసు నమోదు చేశామన్నారు.
ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్