‘ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగం’ | Karnataka Minister Says Cows Are Our Family Members | Sakshi
Sakshi News home page

‘ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగం’

Published Mon, Aug 31 2020 4:05 PM | Last Updated on Mon, Aug 31 2020 4:07 PM

Karnataka Minister Says Cows Are Our Family Members  - Sakshi

బెంగుళూరు: ప్రతి కుటుంబంలో ఆవులు ఓ భాగమని, అలాంటి ఆవులను చంపడం నేరమని కర్నాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్‌ తెలిపారు. చిక్కబల్లాపూర్‌లో గోశాల ప్రారంభత్సంలో సుధాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోసంరక్షణ, గోవధ నిషేధ చట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. వ్యాధి కారకాలను ఆవు నిరోదిస్తుందని ఇది వరకే రుజువు అయిన విషయాన్ని సుధాకర్‌ గుర్తు చేశారు. గోవద నిషేద చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి యడియూరప్ప సిద్దంగా ఉన్నారని తెలిపారు.

కాగా కరోనా వ్యాప్తి తగ్గగానే ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, గోవద నిషేద చట్టానన్న అమలు చేస్తున్న గుజరాత్‌, యూపీ తదితర రాష్ట్రాలకు వెళ్లి గోవద నిషేద చట్టాన్ని అధ్యయనం చేస్తామని పశుశాఖ అధికారులు తెలిపారు. అయితే బీజేపీ గోవద నిషేద చట్టాన్ని 2018అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తమ మేనిఫెస్టేలో చేర్చిన విషయం తెలిసిందే.
చదవండి: నిఖిల్‌ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement