Karnataka Doctor Dies After 2 Days Of Covid Vaccination, టీకా తీసుకున్న డాక్టర్‌ మృతి - Sakshi
Sakshi News home page

టీకా తీసుకున్న డాక్టర్‌ మృతి

Jan 22 2021 2:07 AM | Updated on Jan 22 2021 12:10 PM

Karnataka doctor dies two days after Covid Vaccine - Sakshi

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. జేపీ ఆస్పత్రి యజమాని, ఓ మెడికల్‌ కాలేజీలో ఆర్ధోపెడిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ జయప్రకాశ్‌ (58) ఈ నెల 17వ తేదీన కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో మృతిచెందారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య అధికారులు మాట్లాడుతూ డాక్టర్‌ జయప్రకాశ్‌ హృద్రోగంతో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల కిందట ఆయనకు బైపాస్‌ సర్జరీ జరిగిందని చెప్పారు. ఆయన మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్‌ కాదని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement