Kaali Poster Controversy: మనోభావాలు దెబ్బతినేలా..! క్షమాపణలు చెప్పనంటున్న లీనా

Kaali Poster Controversy: FIRs Filed Against Leena Manimekalai - Sakshi

నూపుర్‌ శర్మ వ్యవహారం ఇంకా వార్తల్లోనే ఉన్న వేళ.. ఈసారి హిందువుల మనోభావాలు దెబ్బ తీసిందంటూ ఓ ఫిల్మ్‌మేకర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ‘కాళి’ పేరుతో  రిలీజ్‌ అయిన ఓ డాక్యుమెంటరీ పోస్టర్‌.. ఇప్పుడు పెనుదుమారంగా మారే అవకాశం కనిపిస్తోంది. 

తమిళనాడులో పుట్టి.. టొరంటో(కెనడా)లో ఉంటున్న లీనా మణిమేకలై..  కాళి టైటిల్‌తో రెండు రోజుల కిందట ఓ పోస్టర్‌ను వదిలింది. పోస్టర్‌ మరీ అభ్యంతరకరంగా ఉండడంతో.. ఆమె క్షమాపణలు చెబుతూ, పోస్టర్‌ను తొలగించాలంటూ పలువురు హెచ్చరికలతో కూడిన డిమాండ్లు చేశారు. ఈ తరుణంలో.. క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టేలా లీనా మణిమేకలై వ్యవహరించింది. ఈ ఉదయం ఆమె తమిళంలో చేసిన ఓ ట్వీట్‌.. విషయాన్ని మరింత హీటెక్కించింది. 

అరెస్ట్‌ లీనా మణిమేకలై హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతున్న నేపథ్యంలో.. ముందు సినిమా చూడాలని, ఆపై అరెస్ట్‌ అంటూ డిమాండ్‌ చేసిన వాళ్లంతా లవ్‌యూ అంటారంటూ ట్వీట్‌లో ఆమె పేర్కొంది. అయితే ఆమె వివరణతో వివాదం మాత్రం చల్లారడం లేదు. నూపుర్‌ శర్మను తప్పుబట్టిన వాళ్లంతా ఇప్పుడు ఏమైపోయారని నిలదీస్తున్నారు పలువురు. 

ఢిల్లీకి చెందిన ఓ లాయర్‌ లీనా.. లీనాపై ఢిల్లీ సైబర్‌ సెల్‌ ఐఎఫ్‌ఎస్‌వోలో ఫిర్యాదు చేశారు. గౌ మహాసభ నిర్వాహకుడు అజయ్‌ గౌతమ్‌.. పోలీసులకు పిర్యాదు చేయడంతో పాటు హోం సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ డాక్యుమెంటరీని ఆపించాలంటూ కోరుతున్నారాయన. మరికొన్ని చోట్ల సైతం లీనాపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

‘‘పోగొట్టుకోవడానికి నా దగ్గరంటూ ఏమీ లేదు. ప్రాణం ఉన్నంత వరకు.. దేనికీ భయపడకుండా మాట్లాడతాను. ఒకవేళ నా ప్రాణమే వెల కడితే.. ఇచ్చేస్తాను’ అంటూ మరో ప్రకటన చేసింది ఆమె. టొరంటో ఆగాఖాన్‌ మ్యూజియమ్‌ వద్ద రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా సెగ్మెంట్‌లో భాగంగా ఈ డాక్యుమెంటరీని తీసినట్లు ఆమె చెప్తున్నారు. ఒకవైపు లీనా.. మరోవైపు విమర్శకులు ఎంతకూ తగ్గకపోవడంతో ఈ వివాదం ఎంత ముదురుతుందో చూడాలి!.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top