పూంఛ్‌ ఘటన ప్రమాదం కాదు.. ఉగ్రదాడి: భారత ఆర్మీ, ఐదుగురు జవాన్ల వీరమరణం

JK Poonch Update: Army Truck incident Terrorist Attack Says Army - Sakshi

ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ పూంచ్‌లో గురువారం జవాన్ల ట్రక్కుకు జరిగింది ఘోరం ప్రమాదం కాదని.. అది ఉగ్రదాడి అని భారత సైన్యం నిర్ధారించింది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలైనట్లు ప్రకటించింది ఆర్మీ.  

జమ్ము-పూంచ్‌ హైవేపై రాజౌరీ సెక్టార్‌ తోతావాలి గల్లీ దగ్గర జవాన్లు వెళ్తున్న ట్రక్కుపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారని, మంటలు చెలరేగి రాష్ట్రీయ రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన ఐదుగురు జవాన్లు వీరమరణం చెందినట్లు ఆర్మీ తెలిపింది. మరో జవాన్‌ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జవాన్లను ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి మోహరించే క్రమంలోనే ఈ ఘోరం జరిగింది. 

వర్షం పడుతుండడంతో ట్రక్కు నెమ్మదిగా వెళ్లోందని, ఇది ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరి దాడికి పాల్పడ్డారని సైన్యం తెలిపింది. తొలుత ఇది పిడుగు ప్రమాదంగా భావించిన ఆర్మీ.. దర్యాప్తునకు ఆదేశించింది. సీనియర్‌ ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించగా.. చివరికి ఉగ్రదాడిగానే తేల్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top